city of mosquitos
దోమలున్నాయు జాగ్రత్త!
గ్రేటర్ హైదరాబాద్లో అపరిశుభ్రత కారణంగా రోగాలు పెరిపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం దోమలు. మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవడం పౌరుల కర్తవ్యం. దీన్ని అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు. కాలనీల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో దోమలు పెరుగుతున్నాయి. పైగా మనం విచ్చలవిడిగా వాడుతున్న మస్కిటో కాయిల్స్, రిఫెల్లెంట్స్ లాంటి రసాయనిక మందులతో అవి ఇంకా బలపడుతున్నాయి. ఇది సర్వే తేల్చిన నిజం. మనం వాటిని సునాయసంగా చంపడం గురించి ఆలోచించడం మానేసి దోమలను నివారించడానికి మార్గాలను వెతుక్కోవాలి.
జబ్బు చేసిన గ్రేటర్
మలేరియా నిరుడు 352 కేసులు, ఈ ఏడాది 528 కేసులు
డెంగీ నిరుడు 183 కేసులు, ఈ ఏడాది 604 కేసులు
దోమల గణాంకాలు
- జంట నగరాల్లో పదిహేను వందల మురికివాడలు
- జంట నగరాల వారిని కుడుతున్న దోమలు మొత్తం ఐదు రకాలు
- క్యూలెక్స్ దోమలు 65 శాతం... వీటితో వచ్చే వ్యాధి-బోదకాలు
- ఎనాఫిలిస్ దోమలు 14 శాతం... వీటితో వచ్చే వ్యాధి- మలేరియా
- ఆర్మిజెర్స్ దోమలు 13 శాతం... అంతగా ప్రమాదం లేదు
- ఏడిస్ దోమలు 7 శాతం...వీటితో వచ్చే వ్యాధి- డెంగీ
- మన్సోనియా దోమలు 1 శాతం... అంతగా ప్రమాదం లేదు
No comments:
Post a Comment